Home Politics మందు తయారీ ప్రారంభించాను.. వాళ్ళు మాత్రం రాకండి: ఆనందయ్య

మందు తయారీ ప్రారంభించాను.. వాళ్ళు మాత్రం రాకండి: ఆనందయ్య

0

ఎట్టకేలకు ఆనందయ్య మందు పంపిణీకి అన్ని అడ్డంకులు తొలగాయి.. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారంతో పాటు హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
మందు పంపిణీకి అన్ని పార్టీలు నాకు ఎంతో సహకరించాయి అని ఆనందయ్య అన్నారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన… మా నాన్న వ్యవసాయం చేసుకోను ఒక్క చిన్న రైతు… నేను వ్యాపారం చేసే వాడిని. రియల్ ఎస్టేటు లో తీవ్రంగా నష్ట పోయాను. అప్పుడు నా కుటుంబసభ్యులు నా వెనుక ఉండి సహకారం అందజేశారు. ఇప్పటి వరకు లక్ష రూపాయలు నా సోంత డబ్బు ఖర్చు పెట్టాను. తిరుపతిలోను గత సంవత్సరం 500 మందికి మందు ఇచ్చాను.

కొన్ని కారణాల వల్ల 15 రోజులు ప్రభుత్వం నా మందును ఆపింది.. ఇప్పుడు మళ్ళీ అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలో ఎమ్మెల్యే ల ద్వారా మందు పంపిణీకి ప్రణాళిక రచిస్తూన్నం. స్వచ్ఛంద సంస్థలు మాకు ఆర్ధికంగా సహాయం చేస్తామని ముందుకు వచ్చాయి. అన్ని రాష్టాల వారికి మందును అందిస్తాను.

కరోనా మూడో వేవ్ కి తాను సిద్దంగా ఉన్నాను అని తెలిపారు. చిన్న పిల్లల కు కూడా తన దగ్గర మందు ఉందని కాని దాని తగిన మోతాదులో మందు ఇస్తానని చెప్పారు. డాక్టర్లను, వైద్యాన్ని కించపరచాడాన్ని తాను వ్యతిరేకిస్తున్నాను. నాకంటే ఎన్నో ఏళ్ళుగా వాళ్ళు సేవ చేస్తున్నారు అని చెప్పిన ఆనందయ్య రేపటి నుంచి మందు తయారీనీ ప్రారంభిస్తాం అని మీడియా ముందు తెలియజేసారు

Exit mobile version