Wednesday, June 23, 2021

సీఎం జ‌గ‌న్ కు ఆనంద‌య్య సంచలన లేఖ‌..!

Must Read

దేశం మొత్తం కరోనా మహమ్మారికి భయపడి ఇళ్లలోనే జీవిస్తున్నారు. అయిహే వ్యాక్సిన్ వచ్చినా కూడా వైరస్ వ్యాప్తి తగ్గలేదు.. ఈ పరిస్థితుల్లో కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన మందు ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు హై కోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మందు పంపిణీకి..

అయితే తాజాగా ఆయుర్వేద మందు పంపిణీ పూర్తి చేసిన ఆనంద‌య్య‌… సీఎం జ‌గ‌న్ కు లేఖ రాశారు. ఔష‌ధం త‌యారీ, సామాగ్రి, మూలిక‌ల సేక‌ర‌ణ కోసం త‌మ‌కు స‌హ‌కారం అందించాల‌ని లేఖ‌లో కోరారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల దృష్ట్యా ఎక్కువ మొత్తంలో మందు తయారుచేసి ఇతర రాష్ట్రాలకు పంపిణీ చేసే విధంగా ప్రభుత్వం నుంచి సహాయ, సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనంద‌య్య‌ లేఖలో తెలిపారు.

ఇక ఆనంద‌య్య పంపిణీ మంగ‌ళ‌వారం నెల్లూరు జిల్లా మ‌నుబోలు మండ‌లంలో జ‌రుగుతోంది. వాలంటీర్ల ద్వారా ఆయుర్వేద‌ మందును ఇంటింటికి ఇస్తున్నారు . మందుకోసం ఇత‌ర ప్రాంతాల నుండి ఎవ‌రూ రావొద్ద‌ని ఇప్ప‌టికే ఆనంద‌య్య విజ్ఞ‌ప్తి చేయ‌గా, కృష్ణపట్నం పంచాయతీ పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంది.

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This