Saturday, June 19, 2021

బిగ్ బ్రేకింగ్: లాక్‌డౌన్ మ‌ళ్లీ పొడిగింపు.. కొత్త రూల్స్..!

Must Read

ప్రస్తుతం కొనసాగిస్తున్న లాక్ డౌన్ , కర్ఫ్యూ లతో అనుకున్న స్థాయిలో క‌రోనా కేసులు అదుపులోకి రాక‌పోవ‌డంతో త‌మిళ‌నాడు ప్రభుత్వం మ‌ళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్ర‌భుత్వం.. ఇప్ప‌టి వ‌ర‌కు లాక్‌డౌన్ ఆంక్ష‌లు ఈ నెల 7వ తేదీ వ‌ర‌కు అమ‌ల్లో ఉండ‌గా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్ర‌కించారు..

కోవిడ్‌ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ స‌డ‌లింపులు ఇస్తున్నారు.. పశ్చిమ మరియు డెల్టా ప్రాంతంలో 11 జిల్లాల్లో కేసులు ఎక్కువ‌గా వెలుగు చూస్తున్నాయి.. ఆ ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ను క‌ఠినంగా అమ‌లుచేస్తారు.. ఇక‌, షాపింగ్ కాంప్లెక్స్, మాల్స్, పర్యాటక ప్రదేశాలు, సినిమా థియేట‌ర్లు, సెలూన్లు మాత్రం రాష్ట్రవ్యాప్తంగా మూసివేయబడతాయి.

తమిళనాడు అంతటా.. నిత్యావ‌వ‌స‌రాల‌కు అవ‌స‌ర‌మైన షాపులు, చేపలు మరియు మాంసం స్టాల్స్ ఉదయం 6 నుండి సాయంత్రం 5 గంటల మధ్య అనుమతించబడతాయి. కూరగాయలు, పండ్లు, పువ్వులు అమ్మే షాపుల‌ను ఉదయం 6 నుంచి సాయంత్రం 5 గంటల వ‌ర‌కు తెరిచే ఉంటాయి.. చేపల మార్కెట్లలో మరియు కబేళాలలో హోల్‌సేల్ వ్యాపారం మాత్రమే అనుమతించబడుతుంది. భౌతిక దూరం ఉండేలా జిల్లా యంత్రాంగం ఒకటి కంటే ఎక్కువ చోట్ల బహిరంగ హోల్‌సేల్ మార్కెట్లకు ఏర్పాట్లు చేసింది. ఇక‌, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు 30 శాతం ఉద్యోగులు, సిబ్బందితో పనిచేస్తాయి. మ్యాచ్ బాక్స్ పరిశ్రమలు 50 శాతం కార్మికులతో నడుస్తాయి,

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This