Tuesday, July 27, 2021

బీజేపీకి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్‌ ఏర్పాటుకు ప్రతిపక్షాల వ్యూహం

Must Read

అధికారంలో ఉన్న బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొవాలంటే అన్నీ పార్టీలతో కలసి పనిచేయాల్సిన అవసరముందన్నారు. పవార్ నివాసంలో ఇటీవల జరిగిన సమావేశం తర్వాత థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై ఊహగానాలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో శరద్ పవార్ తాజాగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ లేకుండా మరో కూటమి అసాధ్యమని సీనియర్ నేత, ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ స్పష్టం చేశారు.

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుపై చర్చించలేదు కానీ, బీజేపీ వ్యతిరేక కూటమికి సమిష్టి నాయకత్వం అవసరమని స్పష్టం చేశారు. రాజకీయ మంత్రాంగంలో శరద్ పవార్‌ది అందవేసిన చేయి. మహారాష్ట్రలో సిద్ధాంతపరంగా భిన్నమైన శివసేన.. ఎన్‌సీపీ-కాంగ్రెస్‌లు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడంలో పవార్ కీలక పాత్ర పోషించారు.

మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా స్థాపించిన రాష్ట్ర మంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి పవార్ నేతృత్వం వహించారు. రాష్ట్ర మంచ్‌ సమావేశంలో మూడో కూటమి గురించి చర్చించలేదన్నారు. కానీ, ప్రత్యామ్నాయ ఫ్రంట్ ప్రస్తావన వచ్చిందని మాత్రం క్లారిటీ ఇచ్చారు. బీజేపీని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్‌‌ను కలుపుకుని వెళ్తేనే సాధ్యమవుతుందని సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త ఏర్పడే కూటమికి సమిష్టి నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు. అయితే, కూటమికి మీరు నాయకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు పవార్ సమాధానం దాటవేశారు. శరద్ పవార్ ఇంతకు ముందు చాలాసార్లు ప్రయత్నించారని అన్నారు.

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇటీవల ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌తో వరుసగా భేటీ కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కానీ, మంగళవారం జరిగిన సమావేశాన్ని పరిశీలిస్తే ఆసక్తికరంగా మారింది. మొత్తం ఎనిమిది రాజకీయ పార్టీలు, సినీ, న్యాయ ప్రముఖులు, జర్నలిస్ట్‌లు హాజరయ్యారు. అయితే, ఈ సమావేశానికి కాంగ్రెస్ నేతలు ఎవరూ హాజరుకాలేదు. దీంతో కాంగ్రెస్ లేదా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This