Saturday, June 19, 2021

కరోనా పేషెంట్స్ కు గుడ్ న్యూస్.. ‌అంబాని సంచలన నిర్ణయం!

Must Read

దేశంలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుంది.. ఏడాది గడిచినా ఇంకా పరిస్థితి అదుపులోకు రాలేదు.. థర్డ్ వేవ్ మరింత తీవ్రంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితే గాని పరిస్థితి అదుపులోకి రాదు. తాగాజా రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని గుడ్ న్యూస్ చెప్పారు. అతి తక్కువ ధరలో కరోనా డ్రగ్‌‌ తయారు చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలిపారు. సెకండ్‌ వేవ్‌తో అల్లాడిపోతున్న దేశాన్ని ఆదుకునేందుకు ఆసియా బిలియనీర్‌, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్‌ అంబానీ ముందుకు వచ్చారు.

కరోనా టెస్ట్‌‌ కోసం ఈ కంపెనీ ఆర్‌‌–గ్రీన్‌‌, ఆర్‌‌–గ్రీన్‌‌ ప్రో పేరుతో తయారు చేసిన చవక కిట్స్ కు ఇది వరకే ICMR‌‌ నుంచి పర్మిషన్లు వచ్చాయి. చాలా చవగ్గా హ్యాండ్‌‌ శానిటైజర్లనూ తయారు చేస్తామని, ప్రస్తుత శానిటైజర్ల రేట్ల కంటే తమ ప్రొడక్టు ధర ఐదో వంతే ఉంటుందని రిలయన్స్‌‌ వర్గాలు తెలిపాయి. కంపెనీ ఇప్పటికే 15 వేల మెట్రిక్ టన్నుల మెడికల్‌‌ గ్రేడ్‌‌ ఆక్సిజన్‌‌ను ఉచితంగా పంపిణీ చేసింది.

అలాగే చౌక కరోనా టెస్టింగ్‌ కిట్‌ను కూడా లాంచ్‌ చేయనుంది. మార్కెట్‌ ధరలతో పోలిస్తే ఐదో వంతు తక్కువ ధరకే శానిటైజర్లను తయారుచేసే ప్రణాళికను కూడా రూపొందించింది. ఖరీదైన టెస్టింగ్‌ కిట్స్‌, ప్రైవేటు ఆసుపత్రులు వసూలు చేస్తున్న లక్షల కొద్దీ బిల్లులతో బెంబేలెత్తిపోతున్న ప్రజలకు రిలయన్స్‌ ప్రయత్నాలు మంచి ఊరటనివ్వనున్నాయని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. గత ఏడాది పీఎం కేర్స్ ఫండ్‌కు రూ .500 కోట్లు, మహారాష్ట్ర, గుజరాత్ సీఎం రిలీఫ్ఫం డ్‌కు కోటి రూపాయల విరాళం ప్రకటించింది. అలాగే రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 875 పడకలను ఏర్పాటు చేసింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This