Saturday, June 19, 2021

అన్నాచెల్లెలి ప్రేమ.. ఇంట్లో పెద్దలకు విషయం తెలిసి షాకింగ్ నిర్ణయం

Must Read

APలోని‌ కృష్ణా జిల్లాలోని ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం చుట్టూ పక్కల గ్రామాల్లో కలకలం రేపింది. చెట్టుకు ఉరేసుకుని వారిద్దరు ప్రాణాలు తీసుకున్నారు. అయితే ఈ ఘటనకు గురించి షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన ఇద్దరు వరుసకు అన్న-చెల్లెలు. వావి వరుసలు మర్చిపోయి ప్రేమించుకున్న వారిద్దరి.. పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఏమిటని పెద్దలు వార్నింగ్ ఇచ్చి మందలించారు. దీంతో వారు అనాలోచితంగా ఆలోచించి ఆత్మహత్య పాల్పడ్డారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే వెంకటాపురం గ్రామానికి చెందిన పేరుబోయిన రాంబాబు కొడుకు సాయి(22), పేరుబోయిన వెంకట స్వామి కూతురు(15) గత కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు. సాయి.. తనకు చెల్లెలు వరుస అయిన మైనర్‌ ‌అమ్మాయితో బంధం కొనసాగించిన నేపథ్యంలో ఈ విషయం బయటపడకుండా చాలా రహస్యంగా ఉంచాడు. చివరకు ఈ విషయం ఎలాగో పెద్దలకు తెలియడంతో.. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ ఏమిటని వారిని మందలించారు.

అయితే వీరికి మాత్రం పెద్దలు అలా తిట్టడం నచ్చలేదు. దీంతో శనివారం రాత్రి ఇద్దరు ఇంటి నుంచి పారిపోయారు. ఆదివారం ఈ విషయం గుర్తించిన కుటుంబాలు గాలింపు చర్యలు చేపట్టాయి. సమీప గ్రామాల్లో వెతకగా ప్రేమికులిద్దరూ పెదకళ్లేపల్లి వద్ద చెట్టుకు ఉరివేసుకున్నట్లు సమాచారం అందింది. అక్కడ సాయి, మైనర్ బాలిక సమీప గ్రామాల్లో విచారించగా ప్రేమికులిద్దరూ పెదకళ్లేపల్లి వద్ద చెట్టుకు ఉరివేసుకున్నట్లు తెలియడంతో అక్కడి వెళ్లి చూసారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాయి వెంకటాపురం గ్రామ వలంటీర్‌గా పనిచేస్తుండగా, అమ్మాయి 10th క్లాస్ చదువుతోంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This