Saturday, June 19, 2021

రఘురామకృష్ణరాజుపై మరో ఫిర్యాదు.. మళ్ళీ అరెస్ట్..?

Must Read

నరసాపురం MP రఘురామకృష్ణరాజు మళ్ళీ చిక్కుల్లో పడ్డారు. ఇప్పటికే CID కేసు‍లకు సంబంధించి ఆయన బెయిల్‌పై ఉ‍న్నారు. ఇంతలో మరో ఫిర్యాదు ఆయనపై నమోదు అయ్యింది. రెడ్డి సామాజికవర్గాన్ని దూషించారంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు అందింది.

ఇటీవల రఘురామకృష్ణ రాజు మీడియాతో మాట్లాడుతూ రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరిచేలా పలు వ్యాఖ్యలు చేశారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మానవ హక్కుల కమిషన్‌కి ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. రఘురామకృష్ణరాజు మాట్లాడిన వీడియోలను సైతం కంప్లైంట్ తో జత చేశారు. కరుణాకర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదును జాతీయ మానవ హక్కుల కమిషన్‌ విచారణకు ఆదేశించింది. దీనిపై త్వరలోనే రఘురామకి ఎన్‌హెచ్చార్సీ నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం పై కుట్రలు పన్నుతున్నారంటూ ఇటీవల రఘురామకృష్ణరాజుపై CID కేసు నమోదు అయింది. అయితే ఆ కేసులో విచారణ సందర్భంగా అనేక మలుపులు తిరిగింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి రఘురామ బెయిల్‌పై నాటకీయ పరిణామాల మధ్య బయటికి వచ్చారు. తాజాగా మరో సమస్య ఆయన తలకు చుట్టుకుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This