Saturday, June 19, 2021

ఆనందయ్య మందుపై మరో ట్విస్ట్..! ఐ డ్రాప్స్ పై బయటపడ్డ నిజం

Must Read

ఏపీ లో సంచలనం రేపిన ఆనందయ్య మందుపై జగన్ మరో ట్విస్ట్ ఇచ్చారు. ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వలేమని ఏపీ ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిపుణుల కమిటీ నివేదిక రాకుండా అనుమతి ఇవ్వమన్న ప్రభుత్వం.. కంటికి సంబంధించిన విషయం కాబట్టి నిపుణుల ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వలేమని పేర్కొంది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషేంట్స్, ఇక ఐ డ్రాప్స్ మాత్రమే ఆఖరి అవకాశం ఉన్న వారికి అనుమతి ఇస్తారా అని అడిగిన హైకోర్టు…అప్పుడు అందరూ అత్యవసర పరిస్థితి అని వస్తారని పేర్కొంది ప్రభుత్వం.

అయితే ఒక రోజులో కేవలం 15 నుంచి 20 మంది మాత్రమే ఐ డ్రాప్స్ అత్యవసరం అని వస్తున్నారని ఆనందయ్య తరపున న్యాయవాది అశ్వని కుమార్. ఆనందయ్య మందును తాము వ్యతిరేకించడం లేదని, అలా అని నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా అనుమతి ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది ఏపీ ప్రభుత్వం.

ఆనందయ్య మందులో ఐ డ్రాప్స్ విషయంలో తప్ప మిగతా అన్నిటికీ ప్రభుత్వం అనుమతి ఇచిందన్న కోర్టు.. మూడు వారాల సమయం ఖచ్చితంగా కావాలని అంత వరకు రిపోర్ట్ వచ్చే అవకాశం లేదని, ఐ డ్రాప్స్ కి అనుమతి ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని తెలిపింది ప్రభుత్వం.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This