Thursday, June 24, 2021

ఏపీలో టెన్త్, ఇంటర్‌ పరీక్షలు రద్దు? కేంద్రం సంచలన నిర్ణయం

Must Read

కరోనా మహమ్మారి రోజు రోజుకి పెరుగుతూనే ఉంది.. కేసులు తగ్గినా కూడా థర్డ్‌ వేవ్ హెచ్చరికలతో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. CBSE ప్లస్ టూ బోర్డు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లలో ఆందోళన నెలకొని ఉంటుందని, వారిలో ఒత్తిడి పెంచేలా.. పరీక్షల కోసం విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టకూడదని పరీక్షలు రద్దు చేయాలని మోడీ నిర్ణయం తీసుకున్నారు

అయితే ఈ పరీక్షల విషయంలో కేంద్ర ప్రభుత్వమే కీలక నిర్ణయం తీసుకోవడంలో ఏపీ సీఎం జగన్‌ ఏం నిర్ణయం తీసుకుంటారా అని అందరూ ఇప్పుడు ఎదురు చూస్తున్నారు‌. ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని మొదట చెప్పినా ఆ తర్వాత కాస్త దిగొచ్చింది. ఇంటర్‌, 10th క్లాస్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేసింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో AP ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటది అనేదానిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

సెకండ్‌‌వేవ్‌ మరింత తీవ్రంగా ఉండబోతుందని కేసులు భారీగా పెరుగుతాయని, ఇంటర్‌ పరీక్షల నిర్వహణను సవాల్‌ చేస్తూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. హైకోర్టు ప్రస్తుత పరిస్తుతులను, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ఇంటర్ ఎగ్జామ్స్‌ను వాయిదా వేశారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడ్డాక ఇంటర్‌ ఎగ్జామ్స్‌ నిర్వహిస్తామన్నారు. దేశంలో దాదాపుగా అన్నీ రాష్ట్రాల్లో 10th క్లాస్‌ ‌పరీక్షలను రద్దు చేయగా.. ఏపీలో మాత్రం ఇంకా దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు

Latest News

ఆనందయ్య మందు ఫిలింఛాంబర్‌లో పంపిణీ. ఏ విధంగా వేసుకోవాలి, ఏం తినకూడదో చెప్తూ వివరణ

సినీ ఇండస్ట్రీలో చాలా మంది ఆనందయ్య మందు పంపిణి చేయమని కోరుతున్నారు. అందరి కోరిక మేరకు కరోనా నియంత్రణలో భాగంగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్...

More Articles Like This