Saturday, June 19, 2021

సీఎం వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు కేసు.. కోర్టు సంచలన తీర్పు

Must Read

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ న‌ర‌సాపురం ఎంపీ ర‌ఘురామ కృష్ణంరాజు సీబీఐ కోర్టులో పిటీష‌న్ దాఖ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో ఈ రోజు జ‌గ‌న్ త‌ర‌పు న్యాయ‌వాదులు 98 పేజీల కౌంట‌ర్ దాఖ‌లు చేశారు. జగన్ బెయిల్ షరతులను ఎక్కడా ఉల్లంఘించలేదని అందులో పేర్కోన్నారు. సీబీఐని ప్రభావితం చేస్తున్నారన్న పిటిషనర్ వాదనలో నిజం లేదని పేర్కొన్నారు. సీబీఐ కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తుందని.. పిటిషనర్ రఘురామరాజుకు ఈ కేసులో సంబంధం లేదని వివ‌రించారు. ఇలాంటి కేసుల్లో థర్డ్ పార్టీ జోక్యం చేసుకోవద్దని సుప్రీం కోర్టు తీర్పులున్నాయని స్ప‌ష్టం చేశారు.

పిటీష‌న‌ర్ వైసీపీ స‌భ్యుడిగా ఉండి, వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారని, దీంతో అత‌డిని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాల‌ని స్పీక‌ర్ కి లెట‌ర్ రాసిన‌ట్టు కౌంట‌ర్‌లో పేర్కోన్నారు. వ్య‌క్తికీ, ఇన్వెస్ట్‌గేష‌న్ ఏజెన్సీ మ‌ద్య జ‌రుగుతున్న విచార‌ణ‌లో మూడో వ్య‌క్తికి సంబందం లేద‌ని, పిటీష‌న‌ర్ పూర్వాప‌రాలు దాచిపెట్టి రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే పిటీష‌న్ వేసిన‌ట్టు ప్ర‌తివాది న్యాయ‌వాదులు తెలిపారు.

మరోవైపు CBI కూడా న్యాయస్థానంలో మెమో దాఖలు చేసింది. రఘురామ పిటిషన్‌పై చట్టప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. కోర్టు విచక్షణ మేరకు నిర్ణయం తీసుకోవాలని కోరింది. ఇరువురి వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం విచారణను ఈనెల 14కి వాయిదా వేసింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This