Saturday, June 19, 2021

APలో ప్రైవేట్ ఆసుపత్రులకు షాకిచ్చిన జగన్ ప్రభుత్వం

Must Read

APలోని ప్రైవేట్ ఆసుపత్రులపై కొరడా జలిపించింది జగన్ ప్రభుత్వం. కరోనా నిబంధనలు గాలికి వదిలేసి నిబంధనలు ఉల్లంగించిన తిరుపతిలోని సంకల్ప ఆసుపత్రి, శ్రీ రమాదేవి మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, పుత్తూరు సుభాషిణి ఆసుపత్రి, పీలేరు లోని ప్రసాద్ ఆసుపత్రి, మదనపల్లి లోని చంద్ర మోహన్ నర్సింగ్ హోమ్ లపై చాలా ఫిర్యాదులు రాగా తనిఖీ చేసిన అధికారులు లక్షల రూపాయలు ఫైన్లు విధించారు

మూడు రోజుల గడువు లోగా విధించిన ఫైన్ కట్టాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఆసుపత్రుల యజమాన్యం పై IPC 188, 406, 420, 53 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు.

డ్రగ్ ఆడిట్ లో బయటపడ్డ రెమ్ డెసివర్ ఇంజక్షన్ల అక్రమ వినియోగం, హాస్పిటల్లో అనుమతి లేకుండా బెడ్ లు ఏర్పాటు చేసుకోవడం, ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నా కూడా పేషెంట్స్ నుంచి అడ్వాన్సులు తీసుకోవడం, వైద్యం చేయడం, అధిక ధరలకు సిటీ స్కాన్ లు నిర్వహించడం లాంటి అక్రమాలు జరిగాయని గుర్తించింది ఈ హాస్పిటల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This