Saturday, June 19, 2021

ఆనందయ్య మందుకు CM జగన్ గ్రీన్‌సిగ్నల్.. కాని?

Must Read

AP ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య కరోనాకు తయారు చేసిన ఆయుర్వేద మందుకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది. కళ్ళలో వేసే డ్రాప్స్‌ తప్ప మిగిలిన అన్ని మందులకు అనుమతి ఇచ్చింది. ఆనందయ్య ఇచ్చే P,L,F‌ మందులకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన ప్రభుత్వం…‘K’ అనే మందును పరిశోధనకు చూపించలేదనే కారణంతో నిరాకరించింది. CCRAS‌ ఇచ్చిన నివేదిక ప్రకారం జగన్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఆనందయ్య ప్రజలకు పంపిణీ చేస్తున్నన మందుల వల్ల ఎలాంటి ప్రాణ లేదని రిపోర్ట్స్ లో తేలింది. ఒక్క కంట్లో వేసే మందుపై ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంది. అయితే ఆ రిపోర్ట్ రావడానికి మరో 2–3 వారాల టైమ్ పడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఆనందయ్య మందు వాడితే కరోనా తగ్గిపోతుంది అనడానికి ఎలాంటి ఆధారాలు లేవని రిపోర్టు లో వెల్లడించారు. కావున ఆనందయ్య మందు వేసుకున్నా మెడిసిన్ వేసుకోవడం ఆపొద్దని ఏపీ ప్రభుత్వం ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. డాక్టర్లు ఇచ్చిన మందులను వాడుతూ ఆనందయ్య మందును వాడుకోవచ్చని స్పష్టం చేసింది.

దీంతో పాటు ఆనందయ్య మందు కోసం కరోనా‌ పాజిటివ్‌ ఉన్నవారు కృష్ణపట్నం రావొద్దని హెచ్చరికలు జారీ చేసింది. వారి బదులుగా కుటుంబసభ్యులు, స్నేహితులు ఎవరైనా వచ్చి మందు తీసుకోవాలని సూచించింది.

మందు పంపిణీ టైం లో కొవిడ్‌ రూల్స్‌ తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ప్రభుత్వం కొన్ని రూల్స్ విధించినా.. మొత్తానికి ఆనందయ్య మందుపై సానుకూల నిర్ణయం తీసుకోవడం పట్ల AP ప్రజలు సంతోషించారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This