Friday, July 30, 2021

ఏపీలో సంచలనం: ఇద్ద‌రు ఐఏఎస్ ల‌కు జైలు శిక్ష విధించిన హైకోర్టు

Must Read

ఏపీ హైకోర్టు మరోసారి సీరియస్ అయింది.. త‌మ ఆదేశాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌టంపై ఏపీ హైకోర్టు ఇద్ద‌రు ఐఏఎస్ ల‌కు వారం రోజుల జైలు శిక్ష విధించింది. ఎన్నిసార్లు ఆదేశించినా తీర్పును లెక్క చేయ‌క‌పోవ‌టంతో జైలు శిక్ష నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలిపింది. తమ ఉద్యోగాలను నిబంధనల ప్రకారం రెగ్యులరైజ్ చేయాల్సి ఉన్న చేయలేదంటూ 36 మంది ఉద్యోగులు గతంలో కోర్టును ఆశ్రయించారు. వారి పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు అందర్నీ రెగ్యులరైజ్ చేయాలని ఆదేశించింది.

కోర్టు చెప్పినా వారిని రెగ్యుల‌రైజ్ చేయ‌లేదు. దీందో ఉద్యోగులు మ‌రోసారి కోర్టును ఆశ్ర‌యించ‌గా… ప‌లుసార్లు హైకోర్టు రెగ్యుల‌రైజ్ చేయాల‌ని ఆదేశాలు జారీ. అయినా అధికారులు కోర్టు ఉత్త‌ర్వుల‌ను అమ‌లుప‌ర్చ‌లేదు. దీంతో నిర్ల‌క్ష్యం వ‌హించిన అధికారులు ఐఏఎస్ గిరిజా శంకర్‌, చిరంజీవి చౌద‌రికి వారం జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టు ధిక్కరణ కేసులో చిరంజీవిచౌదరి, గిరిజాశంకర్‌ వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు.

ప్రభుత్వ పెద్దల ఒత్తడి వల్లే ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయలేదని, ఇప్పుడు శిక్ష అనుభ‌వించాల్సి వ‌స్తుంద‌న్న చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే, శిక్ష విధించిన త‌ర్వాత… కోర్టు హాల్ లో తీర్పును అమ‌లు చేస్తామ‌ని అధికారులు చెప్ప‌టంతో కోర్టు జైలు శిక్ష తీర్పును వెనక్కి తీసుకుంది.. దీంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This