Saturday, June 19, 2021

AP గ‌వ‌ర్న‌ర్‌కు చంద్రబాబు సంచలన లేఖ

Must Read

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఏపీలో పోలీసులు సామాన్య ప్రజలను భయపెట్టి కేసుల పేరుతో వేధిస్తున్నారని, రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని లేఖలో తెలిపారు చంద్రబాబు. కరోనా వేళ ఫ్రంట్‌లైన్ వారియర్స్‌, సామాన్య ప్రజలను అర్థం లేని వేధింపులకు గురి చేస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుత వైరస్ కారణంగా ప్రజలు అనేక కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వము, స్నేహ హస్తం అందించి ప్రజలకు ధైర్యం ఇవాల్సిన పోలీసులు కావాలి. విశాఖలో నడిరోడ్డుపై దళిత యువతి లక్ష్మీ అపర్ణను పోలీసులు అడ్డుకున్న తీరును ప్రస్తావిస్తూ.. ప్రజల హక్కులను హరిస్తున్న వైనాన్ని లేఖలో వివరించారు.

వైసీపీ పాలనలో కొందరు పోలీసుల తీరు, నిరంకుశ పాలకుల ప్రైవేటు సైన్యం గా పని చేస్తున్నారని అన్నారు. ప్రజల హక్కులను హరిస్తోంది, కాబట్టి ఒక రాష్ట్రాధిపతిగా వ్యవస్థను చక్కదిద్దే దిశగా ఈ విషయంలో మీరి చర్యలు తీసుకోవాలని కోరారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This