Saturday, June 19, 2021

బ్రేకింగ్: రేపు ఢిల్లీకి సీఎం జ‌గ‌న్‌..

Must Read

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ రేపు ఢీల్లీ ప్రయాణం చెయ్యనున్నారు. ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కాబోతున్నారు. పోల‌వరం ప్రాజెక్టుకు సంబందించిన నిధులు, పెండింగ్‌లో ఉన్న అంశాల‌పైన‌, విభ‌జ‌న చ‌ట్టంలో అమ‌లు చేయాల్సిన హామీల పైన సీఎం వైఎస్ జ‌గ‌న్ కేంద్ర మంత్రి షాతో చ‌ర్చించ‌బోతున్నారు.

అమిత్ షాతో భేటీ త‌రువాత ఢిల్లీలో అందుబాటులో ఉన్న కేంద్ర‌మంత్రుల‌తో కూడా సీఎం వైఎస్ జ‌గ‌న్ స‌మావేశం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అధికారులు చెబుతున్నారు. క‌రోనా కారణంగా పోల‌వ‌రం ప్రాజెక్ట్ నిర్మాణం పనులు చాలానే పెండింగ్‌లో ప‌డిపోయాయి.

ఈ ఎడాది జూన్ నాటికి పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తిచేయాల‌ని సీఎం జగన్ లక్ష్యంగా పెట్టుకున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా తగ్గుముఖం ప‌డుతుండ‌టంతో ప్రాజెక్టును త్వ‌రిత‌గ‌తిన పూర్తి చేయ‌డానికి ఏపీ ప్ర‌భుత్వం కసరత్తులు చేస్తుంది

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This