Saturday, June 19, 2021

బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత..?

Must Read

ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మంగ‌ళ‌వారం మధ్యాహ్నం 2 గంటలకు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో కేబినెట్ జరగబోతుంది. ఈ మీటింగ్ లో ప‌లు అంశాలపై ప్ర‌భుత్వం చ‌ర్చించ‌నుంది. రాష్ట్రంలో కరోనా స్థితిగతులు, లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇవ్వాలా లేదా ఎత్తివేయాలా, రైతుబంధు, వ్యవసాయం పనులపై ప్ర‌ధానంగా కేబినెట్ మీటింగ్ లో చర్చ జరగనున్నాయి.

లాక్‌డౌన్ కార‌ణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? ఈస‌మ‌యంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌నులు, కార్య‌క్ర‌మాల‌ను ఎలా ముందుకు తీసుకెళ్లాల‌న్న అంశాల‌పైనా కేబినెట్ చ‌ర్చించే అవ‌కాశ‌ముంది. మ‌రోవైపు కరోనా థర్డ్‌వేవ్‌ సన్నద్ధతపైనా కేసీఆర్ మంత్రివ‌ర్గంలో చ‌ర్చించ‌నున్న‌ట్టు తెలిసింది.ఇక లాక్‌డౌన్ స‌డ‌లింపులు ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ప్రణాళికలు చేస్తున్నాటు సమాచారం.

ఏయే కార్య‌క్ర‌మాల‌కు అనుమ‌తి ఇవ్వాలి…వేటిపై ఆంక్ష‌లు కొన‌సాగించాల‌న్న జాబితాను సిద్ధం చేస్తోంది. మ‌రోవైపు ప్ర‌స్తుత‌మున్న లాక్‌డౌన్‌నే కొన‌సాగిస్తూ.. మ‌రిన్ని సడలింపులు ఇవ్వాలని అధికారులు ఆలోచిస్తున్నట్టు సమాచారం.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This