Saturday, June 19, 2021

బ్రేకింగ్: తెలంగాణ‌లో ‌స్కూల్స్, కాలేజీలు ఓపెన్?

Must Read

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుంది. విద్యా సంస్థలు తిరిగి ప్రారంభించడానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఏప్రిల్ 27 నుండి జూన్ 1వ‌ర‌కు వేసవి సెల‌వుల‌ను ప్ర‌భుత్వం ఖ‌రారు చేసింది. ఆ త‌ర్వాత క‌రోనా కార‌ణంగా మ‌రో 15రోజుల పాటు సెల‌వులు పొడిగించ‌గా, ఆ త‌ర్వాత విద్యా సంస్థ‌ల ప్రారంభంపై స‌ర్కార్ ఫోక‌స్ చేసింది.

తెలంగాణ‌లో క‌రోనా కార‌ణంగా ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు చేశారు. ఇంట‌ర్ ద్వితీయ సంవ‌త్స‌రం ప‌రీక్ష‌ల‌ను కూడా ర‌ద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, తెలంగాణ‌లో క‌రోనా ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ్డాయ‌ని ప్ర‌భుత్వం చెప్తున్న నేప‌థ్యంలో డిగ్రీ, ఆ పై త‌ర‌గతుల ఫిజిక‌ల్ క్లాసులు నిర్వ‌హించే అంశంపై చర్చించారు.

జులై నుండి ఫిజిక‌ల్ క్లాసుల నిర్వ‌హ‌ణ‌కు మొగ్గుచూపుతున్న‌ట్లు తెలుస్తోంది. ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు ఆన్ లైన్ క్లాసులు నిర్వ‌హించాల‌ని… 5వ త‌ర‌గ‌తి నుండి 9వ త‌రగ‌తి వారికి టీశాట్ ఛానల్స్ ద్వారా క్లాసులు చెప్పించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This