Saturday, June 19, 2021

తెలుగు రాష్ట్రాలకు అలర్ట్.. హెచ్చరిస్తున్న వాతావరణ శాఖ

Must Read

రానున్న రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్ ఘడ్ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 0.9 కిమీ వద్ద ఏర్పడింది. గాలి విచ్చిన్నం తెలుగు రాష్ట్రాలపై సముద్ర మట్టానికి 1.5 కిమీ వరకు ఉంది. మరోవైపు నైరుతి ఋతుపవనాలు బలపడ్డాయి.

రాబోయే 24 గంటల్లో ఈ ఋతుపవనాలు కర్యలలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో తెలుగు రాష్ట్రాలలో రానున్న 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో పలు చోట్ల భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కోస్తాంధ్ర, రాయలసీమలలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక నిన్న హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో సిటీ మొత్తం జలమయమైంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This