Tuesday, July 27, 2021

పరీక్షలపై సాయంత్రంలోగా నిర్ణయం చెప్పండి: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం డెడ్‌లైన్

Must Read

సుప్రీంకోర్టులో ప్రభుత్వం అఫిడ్‌విట్ దాఖలు చేసింది. దీంతో కరోనా వైరస్ రెండో దశ వ్యాప్తి కారణంగా వాయిదాపడిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గుచూపడంతో సుప్రీం కోర్టు డెడ్‌లైన్ విధించింది.

ఏపీ ప్రభుత్వం దాఖలుచేసిన  పదో తరగతి, ఇంటర్ పరీక్షల నిర్వహణకు సంబంధించిన అఫిడ్‌విట్‌‌పై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పరీక్షలపై ఇప్పటికిప్పుడే నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పరీక్షల వల్ల ఒక్కరు చనిపోయినా రూ.కోటి పరిహారం చెల్లించాలని స్పష్టం చేసింది. పరీక్షలు జులై చివరి వారంలో నిర్వహిస్తామని చెప్పారని, పూర్తి వివరాలను పేర్కొనలేదని గురువారం నాటి విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. అఫిడ్‌విట్‌లో ఓ ప్రణాళిక లేదని, అంతా అనిశ్చితేనని ధర్మాసనం పెదవి విరిచింది. 
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This