Saturday, June 19, 2021

దేశ రాజధానిలో అన్ లాక్: కొత్త రూల్స్ ఇవే..!

Must Read

ఢిల్లీలో క‌ఠిన లాక్ డౌన్ అమ‌లుతో రోజువారి కేసుల సంఖ్య 30వేల ద‌గ్గ‌ర నుండి 500లోపుకు దిగివ‌చ్చాయి.. దీంతో క‌రోనా సెకండ్ వేవ్ నుండి బ‌య‌ట‌ప‌డి…
దేశానికి ఆద‌ర్శంగా నిలిచింది ఢిల్లీ. దీంతో సీఎం కేజ్రీవాల్ అన్ లాక్ ప్ర‌క్రియ‌ను స్టార్ట్ చేశారు. ఇందుకు సంబంధించి కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసారు.

కరోనా ముందు ఢిల్లీలో కాలుష్యాన్ని క‌ట్ట‌డి చేసేందుకు ఫాలో అయిన స‌రి–భేసి విధానాన్ని మళ్ళీ తీసుకువస్తున్నారు. మార్కెట్లు, మాల్స్ కు ఈ స‌రి, భేసి విధానం అమ‌లు చేస్తామ‌ని… సాధార‌ణ దుకాణాలు, వ్యాపార స‌ముదాయాలు మాత్రం ప్రతి రోజు తెరుచుకోవ‌చ్చ‌ని చెప్పారు. సోమ‌వారం నుండి ఈ అన్ లాక్ స్టార్ట్ అవుతుందని తెలియజేశారు.

ప్ర‌భుత్వ, ప్రైవేటు ‌ఆఫీస్సుల్లో 50శాతం సిబ్బందితో ప‌నిచేసేలా అనుమతి ఇవ్వ‌గా, అత్య‌వ‌స‌ర సేవ‌ల రంగాల‌కు మిన‌హయింపు ఉంటుంది. ఏమాత్రం అవ‌కాశం ఉన్నా ఉద్యోగుల‌కు ఆయా కంపెనీలు వ‌ర్క్ ఫ్రం హోం ఇవ్వాల‌ని సీఎం సూచించారు. ఢిల్లీ మెట్రో కూడా 50 శాతం సామర్థ్యంతో న‌డపాల‌ని నిర్ణ‌యించారు. దశల వారీగా స‌డ‌లింపులు ఉంటాయని కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు.మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామ‌ని ‌హాస్పిటల్లో స‌రిప‌డా ఆక్సిజ‌న్ ఏర్పాటుతో పాటు ఉత్ప‌త్తికి చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని సీఎం కేజ్రీవాల్ తెలియజేశారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This