Saturday, June 19, 2021

బంపర్ ఆఫర్: వ్యాక్సిన్ వేసుకుంటే బీరు ఫ్రీ..!

Must Read

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ భయంతో ప్రజలంతా వ్యాక్సిన్ల కోసం ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్నారు. దేశంలో వ్యాక్సిన్ల కొరతతో 18-45 ఏళ్లలోపు వారికి ఇప్పటికీ టీకాలు వేయడం లేదు. దేశంలో టీకాల ఉత్పత్తి ఇంకా పెరగకపోవడం వల్ల ప్రజలంతా హాహాకారాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే అమెరికాలో మాత్రం ధీనికి విచిత్రమైన పరిస్థితి..

అమెరికా గవర్నమెంట్ ముందస్తుగానే వ్యాక్సిన్ తయారీ దశలోనే కంపెనీలకు బిలియన్ డాలర్లు డబ్బును కేటాయించి దేశ ప్రజల అందరికి సరిపడినన్ని వ్యాక్సిన్లను సేకరించింది. ఇతర దేశాలకు ఎగుమతులు నిషేధించి మరీ మిలియన్ల డోసుల వ్యాక్సిన్ ను అమెరికా ప్రభుత్వం దాచిపెట్టుకుంది. భారత్ కు ఇవ్వడానికి కూడా అమెరికా ముందుకు రావడం లేదు.

అమెరికా ప్రభుత్వం అక్కడి ప్రజలను వ్యాక్సిన్లను తీసుకోమని ఎంతలా ప్రాధేయపడుతున్నా అమెరికన్లు మాత్రం వ్యాక్సిన్లు వేసుకోవడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదట..దీంతో అమెరికాలో వ్యాక్సిన్ తీసుకోవడాన్ని ప్రోత్సహించేందుకు విచిత్రమైన ఆఫర్లు పెడుతున్నారు. ఈ క్రమంలోనే డ్రింక్స్ తయారు చేసే అన్ హైజర్ అనే సంస్థ.. 21 ఏళ్లు పైబడిన యువతను దృష్టిలో ఉంచుకొని కొత్త ఆఫర్ ప్రకటించింది. టీకా వేయించుకొని తమ వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకున్న వారికి ఒక్కొక్కరికి 5 డాలర్ల విలువైన బీర్ ను ఉచితంగా అందిస్తామని సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This