Saturday, June 19, 2021

తెల్గు రాష్ట్రాలకు హైఅలెర్ట్: రాబోయే 3 రోజుల్లో భారీ వర్షాలు

Must Read

నైరుతి రుతుపనాలు తెలంగాణతో పాటు మహారాష్ట్ర మరియు ఆంధ్ర ప్రదేశ్ లలో ఈరోజుతో పూర్తిగా ప్రవేశించాయి. ఉత్తర బంగాళాఖాతం & పరిసర ప్రాంతాలలో ఉన్న ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్ఫియార్ స్థాయి వరకు ఉన్నది. దీని ప్రభావంతో ఈ నెల 11వ తేదీన ఉత్తర బంగళాఖాతం & పరిసర ప్రాతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది.

రాగల 24 గంటలలో మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిస్సా మీదగా వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా బలమైన క్రిందిస్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోనికి వస్తున్నవి.
రాగల 2 రోజులు (10,11వ తేదీలు) తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, తెలంగాణాలోని చాలా ప్రదేశాల్లో మరియు ఎల్లుండి (12వ తేదీ) అనేక ప్రదేశాలలో వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

తెలంగాణాలోని కొన్ని ప్రదేశాలలో రాగల 3 రోజులు (10,11,12వ తేదీలు) ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షలు పడబోతున్నాయని అధికారులు హెచ్చరించారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This