Saturday, June 19, 2021

గుడ్ న్యూస్: 500ల‌కే రెండు డోసుల వ్యాక్సిన్..!

Must Read

దేశంలో కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. వ్యాక్సిన్ కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే దేశ ప్రజలకు ఒక శుభవార్త. అతి చౌకైన వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుంద‌ని జాతీయ మీడియా క‌థ‌నం సంచలన రేపుతుంది. కేవ‌లం 500రూపాయ‌ల‌కే రెండు డోసుల వ్యాక్సిన్ ను బ‌యోలాజిక‌ల్ ఈ కంపెనీ తీసుకరాబోతుంద‌ని తెలిపింది.

అమెరికాకు చెందిన బేలార్ కాలేజ్ ఆఫ్ మెడిసిన్ తో క‌లిసి బ‌యోలాజిక‌ల్ ఈ కంపెనీ కార్బివాక్స్ వ్యాక్సిన్ ను త‌యారు చేసింది. ప్ర‌స్తుతం రెండు ద‌శ‌ల క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ను విజ‌య‌వంతంగా పూర్తి చేయ‌గా… ప్ర‌స్తుతం మూడో ద‌శ ప్ర‌యోగాలు జ‌రుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ 30కోట్ల డోసులు కావాల‌ని ‌మోడీ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే ఆర్డ‌ర్ కూడా ఇచ్చింది.

దేశంలో ప్రస్తుతం ఉన్న వ్యాక్సిన్ ధ‌ర‌లు-

కోవిషీల్డ్- ఒక్కో డోసుకు ప్రైవేటులో 1200, ప్ర‌భుత్వానికి 600 రూపాయ‌లు

కోవాగ్జిన్- ప్ర‌భుత్వానికి 800రూపాయ‌లు, ప్రైవేటుకు 2400 రెండు డోసుల‌కు

స్పుత్నిక్-వీ- ప్రైవేటులో ఒక్కో డోసుకు 995రూపాయ‌లు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This