Saturday, June 19, 2021

గుడ్ న్యూస్: త్వరలో సోనూసూద్ వ్యాక్సినేష‌న్ సెంట‌ర్స్

Must Read

గత ఏడాది కరోనా వైరస్ మొదలవ్వగానే అందరికంటే వేగంగా సహాయలు అందించిన ఏకైక నటుడు సోనూసూద్. క‌రోనా క‌ష్ట‌కాలంలో రియ‌ల్ హీరోగా పేద‌ల‌కు అండ‌గా ఉన్న వ్య‌క్తి. ఉచిత రవాణా సౌకర్యం నుంచి మొదలైన అతని సహాయలు ఇప్పటికీ కూడా ఆగలేదు. లాక్ డౌజ్ అనంతరం కూడా ఎంతోమంది పేద వారికి సహాయం చేశాడు. పేద రైతులకు కూడా అండగా నిలిచాడు. ఖర్చు ఎంత అవుతున్నా కూడా వెనక్కి తగ్గని సోనూసూద్ ఇటీవల ఆక్సిజన్ పంపిణీ కోసం ఒక గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది విషయం తెలిసిందే.

ఇప్పుడు క‌రోనాపై పోరులో కీల‌కంగా మారిన వ్యాక్సినేష‌న్ విష‌యంలోనూ సోనూసూద్ స‌హ‌యం చేయ‌నున్నారు. త‌న హోంటౌన్ పంజాబ్ రాష్ట్రంలోని మోఘా జిల్లాలోని సఫువాలాలో అంద‌రికీ త‌నే ఉచితంగా వ్యాక్సిన్ వేయించ‌బోతున్న‌ట్లు ప్రకటించాడు. ఈ ప‌నిని సోనూసూద్ అక్క మాళ‌విక దగ్గర ఉండి మేరీ చూసుకుంటున్నారు. 18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రికి అక్క‌డ వ్యాక్సిన్ ఇవ్వ‌బోతున్నట్టు సమాచారం..

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This