Tuesday, July 27, 2021

ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 10000 వేల ఉద్యోగాలు

Must Read

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ ఈ రోజు జాబ్ క్యాలెండ‌ర్‌ను రిలీజ్ చేశారు. 2021-22 వ సంవ‌త్స‌రానికి వివిధ శాఖ‌ల్లో మొత్తం 10,143 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు క్యాలెండ‌ర్‌ను విడుద‌ల చేశారు.జులై నెల‌లో 1238 ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భ‌ర్తీకి క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఇక ఆగ‌స్టులో APPSC ద్వారా గ్రూప్ 1,2 కి చెందిన 36 పోస్టుల‌కు నోటిఫికేష‌న్ ను ఉవ్వ‌నున్నారు. సెప్టెంబ‌ర్ నెల‌లో పోలీస్ శాఖ‌లో 450 పోస్టులను భ‌ర్తీ చెయ్యబోతున్నారు.

అదే విధంగా అక్టోబ‌ర్ నెల‌లో వైద్య‌శాఖ‌లో 451 పోస్టుల‌ను భ‌ర్తీ చేసేందుకు స‌ర్కార్ క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టింది. ఇక‌పోతే, న‌వంబ‌ర్ నెల‌లో వైద్య‌శాఖ‌లోని 5,251పారామెడిక‌ల్ పోస్టుల భ‌ర్తీకి చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక‌పోతే, డిసెంబ‌ర్ నెల‌లో 441 న‌ర్సుల పోస్టుల‌ను కూడా ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నున్న‌ది. వ‌చ్చేఏడాది జ‌న‌వ‌రిలో 240 డిగ్రీ కాలేజీ లెక్చ‌ర‌ర్ పోస్టుల‌ను కూడా ప్ర‌భుత్వం భ‌ర్తీ చేయ‌నున్న‌ది. ఈ క్యాలెండ‌ర్ ద్వారా ఏ శాఖ‌లో ఎప్పుడు నోటిఫికేష‌న్ వ‌స్తుందో చెప్ప‌డ‌మే ఉద్దేశ్యం అని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ తెలిపారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This