Friday, July 30, 2021

కరోనాపై భారత్ కు గుడ్ న్యూస్.. ముప్పు తప్పినట్టే..!

Must Read

భారత్ లో క‌రోనా ‌మహమ్మారి త‌గ్గుముఖం పడుతూ వస్తుంది. రోజు రోజుకి కేసులు మ‌రింత తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 70,421 మంది ఈ మ‌హ‌మ్మారి బారిన‌ప‌డ్డారు. అయితే ఇంత త‌క్కువ కేసులు న‌మోదు కావ‌డం ఏప్రిల్ 1 త‌ర్వాత మ‌ళ్లీ ఇదే. పాజిటివ్ కేసులు త‌గ్గుతున్నా.. ప్రాణాలు మాత్రం భారీగానే పోతున్నాయి. క‌రోనా కార‌ణంగా నిన్న దేశ‌వ్యాప్తంగా మ‌రో 3,921 మంది మృత్యువాత‌ప‌డ్డారు. ఇక ఈ మ‌హ‌మ్మారి బారి నుంచి తాజాగా ల‌క్షా 19 వేల మంది కోలుకున్న‌ట్టు కేంద్రం ప్రకటించింది.

క‌రోనా వల్ల దేశంలో ఇప్ప‌టివ‌ర‌కు 2.95 కోట్ల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. ఇందులో 2.81 కోట్ల మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో క‌రోనా కార‌ణంగా 3,74,305 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్ర‌స్తుతం దేశంలో 9.73 ల‌క్ష‌ల యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్లడించింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This