Saturday, June 19, 2021

తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్: మరిన్ని లాక్ డౌన్ సడలింపులు

Must Read

లాక్డౌన్ పెట్టకుండా ఈ కరోనాని కట్టడి చెయ్యడం కష్టమని భావించాయి అన్ని రాష్ట్రాలు. ఆ దిశగా వివిధ రాష్ట్రాలు కేసులు నమోదవుతున్న సంఖ్యను బట్టి నెమ్మదిగా లాక్డౌన్ సడలింపులను ఒక్కొక్కటిగా ఇస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం మొదటి విడతలో ఉదయం 6 నుంచి 10వరకు, రెండవ విడతలో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది.

ప్రస్తుత లాక్డౌన్ కాలం ఈనెల 9తో ముగియనున్నందున తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి మరోసారి సమావేశం అవుతోంది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు సాయింత్రం 5 గంటల వరకు లాక్డౌన్ విధించి ప్రజలు ఇళ్లకు వెళ్లేందుకు వీలుగా మరో గంట అనుమతించాలనుకుంటోంది ప్రభుత్వం.

ఇక కర్ఫ్యూ పకడ్భందీగా అమలు చేయాలనుకుంటోంది. కరోనా థర్డ్ వేవ్ ను సమర్ధవంతంగా ఎదుర్కునేందుకు ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఆంక్షల అమలుతో పాటు హై రిస్క్ ఉన్న వారికి టీకాల వేసేలా ప్రభుత్వం ముందుకు సాగుతుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This