Saturday, June 19, 2021

తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్: ఇకపై ఆనందయ్య మందు డోర్ డెలివరీ..!

Must Read

ఆనందయ్య మందు పంపిణీకి ఏపీ ప్రభుత్వంతో హైకోర్టు సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో మందు తయారీకి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు మందు అందించేందుకు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. వనమూలికలు, ముడిపదార్థాల సేకరణలో ఆనందయ్య యుద్ధప్రాతిపదికన పని చేస్తున్నారు. కరోనా కి ఆనందయ్య మందు అధ్బుతంగా పనిచేస్తుంది అంటూ ఆ నోటా ఈ నోటా పడి మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకి ఇతర రాష్ట్రాలకి కూడా పాకడంతో ఆనందయ్య మందు కోసం అందరూ కృష్ణపట్నం వైపు పరుగులు పెడుతున్నారు.

ఈ సమయంలోనే ఆ మందు అనుమానంతో ప్రభుత్వం మందు పంపిణి ఆపేసి పలురకాల టెస్టులు చేసిన తర్వాత ఆ మందు పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో ఈ మందు కోసం ఇప్పుడు చాలామంది ఎదురుచూస్తున్నారు. అయితే ఇక్కడే మరో సమస్య పొంచి ఉంది. మందు కోసం జనాలు భారీగా తరలివస్తే అక్కడ ఏ ఒక్కరికి కరోనా ఉన్నా కూడా మళ్లీ కరోనా సమస్య మొదటికి వచ్చే ప్రమాదం ఉంది. త్వరలో ఆన్లైన్ ద్వారా ఆనందయ్య మందు పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అంటే ఆనందయ్య మందు ఇంటి వద్దకే అందుబాటులోకి రానుంది. డోర్ డెలివరీ ద్వారా ఆనందయ్య మందు పొందవచ్చు. మందుల తయారీ పంపిణీ విషయాలపై ఆనందయ్యతో నెల్లూరు జిల్లా కలెక్టర్ సమావేశమై చర్చించారు.

కరోనా నిబంధనలు పాటించడం రద్దీని నివారించే అంశాలపైనే చర్చించారు. సమావేశం అనంతరం కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ హైకోర్టు ఆదేశాల మేరకు ఆనందయ్య మందు పంపిణీకి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పాజిటివ్ రోగులకిచ్చే మందు పంపిణీకి మొదట ప్రాధాన్యం ఇస్తామన్నారు. మందు తయారీకి కొన్ని రోజులు టైమ్ పడుతుందని చెప్పారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This