Saturday, June 19, 2021

మరో మూడు భారీ వర్షాలు.. వాతావరణశాఖ హెచ్చరికలు

Must Read

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 నుండి 3 రోజులలో ఋతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ అధికారులు తెలియజేసారు. నిన్న మరత్వాడ నుండి ఉత్తరా ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5కి వరకు ఉన్న ద్రోణి ఈ రోజు బలహీనపడినది. ముఖ్యంగా ఈ రోజు క్రింది స్థాయి గాలులు పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రంలోకి వస్తున్నవి.

దీంతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఈ రోజు ఒకటి రెండు ప్రదేశాల్లో, మరియు రేపు, ఎల్లుండి కొన్ని ప్రదేశాల్లో పడే అవకాశములు ఉన్నాయి. రాగల 3 రోజుల్లో ఉరుములు మరియు మెరుపులు మరియు ఈదురు గాలులు (గాలి వేగం గంటకి 30 నుండి 40 కి మి)తో కూడిన వర్షం తెలంగాణాలో మరియు ఏపీలో వచ్చే అవకాశములు ఉన్నాయి.

11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో 11,12, 13 తేదీలలో తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. కొన్ని ఉత్తర, తూర్పు జిల్లాలలో భారీ మరియు భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This