Home Politics హైదరాబాద్ పోలీసుల రికార్డు: లాక్‌డౌన్‌ లో 37.94 కోట్ల జరిమానాలు

హైదరాబాద్ పోలీసుల రికార్డు: లాక్‌డౌన్‌ లో 37.94 కోట్ల జరిమానాలు

0

ఈ లాక్‌డౌన్‌ సమయంలో నిబంధనలు ఉల్లంఘించినవారికి పోలీసులు భారిగా ఫైన్స్ వేసారు. అవసరం లేకపోయినప్పటికీ రోడ్లపైకి వస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు.. ఇప్పటికే తెలంగాణలో లక్షల వాహనాలు సీజ్ చేశారు.. లాక్ డౌన్ పూర్తయిన తర్వాత వాహనాలను కోర్టుకు అటాచ్ చేస్తామని తెలిపారు..

తెలంగాణ డీజీపీ మహేందర్‌రెడ్డి చెప్పిన వివరాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి జూన్ 7వ తేదీ వరకు మొత్తం 8.79 లక్షల కేసులు నమోదు అయినట్టు వెల్లడించారు. మాస్కులు పెట్టుకొని వారిపై 4.56 లక్షల కేసులు పెట్టామని.. రూ.37.94 కోట్ల జరిమానా విధించామన్నారు.. భౌతిక దూరం పాటించనందుకు 48,643 కేసులు.. లాక్ డౌన్, కర్ఫ్యూ నిబంధనల ఉల్లంఘనలపై 3.43 లక్షల కేసులు నమోదు చేశామని.. లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు.

మరోవైపు.. లాక్ డౌన్ సమయంలోనే రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయాయి… అతి వేగంతో పాటుగా మద్యం తాగి ప్రమాదాలకు గురయ్యే వారి సంఖ్య పెరిగిందని డీసీపీ విజయ్ కుమార్ వెల్లడించారు.. లాక్ డౌన్ సమయంలో 248 రోడ్డు ప్రమాదాలు జరిగినట్టు వెల్లడించారు.. ఈ రోడ్డు ప్రమాదాల్లో 48 మంది మరణించారని తెలిపారు.

Exit mobile version