Saturday, June 19, 2021

ఫైనల్ వార్నింగ్: ఇండియాలో ట్విట్టర్ బ్యాన్..?

Must Read

కొద్దిరోజులుగా కేంద్ర ప్రభుత్వం, ట్విట్ట‌ర్ మ‌ధ్య జ‌రుగుతున్న ‌వార్ ఇక చివరి దశకు చేరుకుంది. కొత్త ఐటీ చ‌ట్టం అమ‌లుపై కేంద్రం, ట్విట్ట‌ర్ సంస్థ‌ల పోరు కొన‌సాగుతుండ‌గా… IT చ‌ట్టం అమ‌లు చేయాల్సిందేన‌ని ట్విట్ట‌ర్ కు మోడీ ప్ర‌భుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది.

అయితే ఈరోజు ఉద‌యం భార‌త ఉప రాష్ట్రప‌తి వెంకయ్య‌నాయుడు బ్లూ టిక్ మార్క్ ను ట్విట్ట‌ర్ ను తొలిగించింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రాగానే వెన‌క్కి త‌గ్గి మళ్ళీ వెంటనే మార్చింది‌.

ఆ త‌ర్వాత కొద్దిసేటికే కేంద్ర ప్రభుత్వం ట్విట్ట‌ర్ కు ఐటీ చ‌ట్టం అమ‌లుపై ఫైన‌ల్ వార్నింగ్ ఇచ్చింది. ఈ చ‌ట్టం ప్ర‌కారం ఇండియన్ ను గ్రీవెన్స్ అధికారిగా నియమిస్తారా? లేదా? అని హెచ్చరించింది. కొత్త ఐటీ నిబంధనలకు తగ్గట్టు ట్విట్టర్ నడుచుకోవాలని, లేదంటే భారత్ లో ట్విట్టర్ బ్యాన్ తప్పదని, జరగబోయే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇదే చివరి నోటీసు అంటూ స్ప‌ష్టం చేసింది. ఇప్ప‌టికే ఈ కొత్త ఐటీ చ‌ట్టంపై కేంద్రం, ట్విట్ట‌ర్ లు కోర్టుల‌ను ఆశ్ర‌యించాయి.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This