Saturday, June 19, 2021

గుడ్ న్యూస్: భార‌త్‌లో త్వ‌ర‌లో సింగిల్ డోస్ వ్యాక్సిన్

Must Read

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మ‌హ‌మ్మారికి అంతుచెయ్యడానికి రకరకాల వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ లు ఏవైనా రెండు డోసులు తప్పనిసరిగా వేసుకోవాలి. మొద‌టి వ్యాక్సిన్ తీసుకున్న 28 రోజుల‌కు సెకండ్ డోస్ తీసుకోవాలి. రెండు డోసుల విధానం వ‌ల‌న వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ కొంత ఆల‌స్యంగా సాగుతున్న‌ది.

దీంతో సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మరంగా కొన‌సాగుతున్నాయి. ప్ర‌పంచంలో క‌రోనాకు తొలి వ్యాక్సిన్‌ను త‌యారు చేసిన స్పుత్నిక్ వి సింగిల్ డోస్ ను తయారు చేసింది. ఇప్ప‌టికే ర‌ష్యాలో ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి రాగా, వివిధ దేశాల్లో దీనికి అనుమ‌తులు మంజూరు చేశారు. కాగా, భారత్ లో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ స్పుత్నిక్ వీ సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనుమ‌తుల కోసం ఇప్పటికే ధ‌ర‌ఖాస్తు చేసుకుంది.

ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు వ‌చ్చిన వెంట‌నే ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తి చేసే అవ‌కాశం ఉంది. వ్యాక్సిన్‌కు అనుమ‌తులు వ‌స్తే ఇండియాలో మొదటి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇదే అవుతుంది. దీనితో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత సులభతరం అవుతుంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This