Tuesday, July 27, 2021

టీకా తీసుకున్నారా..? అయితే మీకో బంపర్ ఆఫర్..!

Must Read

దేశం మొత్తం వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 28 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేసుకున్నారు. అయితే వ్యాక్సినేషన్ ను మరింత ప్రోత్సహించేందుకు తనవంతుగా దేశీయ విమానయాన సంస్థ ఇండిగో తమ ప్రయాణికులకు ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది.

వ్యాక్సిన్ తీసుకున్న ప్రయాణికులకు వ్యాక్సిఫేర్ పేరుతో టిక్కెట్ రేటులో 10శాతం డిస్కౌంట్ ప్రకటించింది. రెండు డోసులు మాత్రమే కాదు.. సింగిల్ డోస్ తీసుకున్నవారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టంచేసింది. ఎయిర్ పోర్టు చెకిన్ కౌంటర్, బోర్డింగ్ గేటు దగ్గర టీకా సర్టిఫికెట్ గానీ.. ఆరోగ్యసేతులో వ్యాక్సినేషన్ స్టేటస్ ను గానీ చూపిస్తే సరిపోతుందని తెలిపింది

అన్ని రకాల టిక్కెట్లకు ఈ ఆఫర్ పనిచేస్తుందని అంటోంది ఇండిగో. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలను వ్యాక్సినేసన్ దిశగా ప్రోత్సహించేందుకు వ్యాక్సిఫేర్ ను ప్రారంభించినట్లు వివరించింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This