Tuesday, July 27, 2021

విజ‌య‌వాడ‌కు రేపు జ‌న‌సేన అధినేత రాక…

Must Read

తిరుప‌తి పార్ల‌మెంట్ నియోజ‌క వ‌ర్గానికి జ‌ర‌గిన ఉప ఎన్నిక త‌రువాత జ‌న‌సేన పార్టీ సైలెంట్ అయింది. గతంలో పార్టీ ప్రభుత్వ విధానాలను
వ్యతిరేకిస్తూ వచ్చింది. క‌రోనా నిబంధ‌న‌లు ఎత్తివేస్తుండ‌టంతో పార్టీ పనులు తిరిగి ప్రారంభం అవుతున్నాయి.

రాష్ట్రంలో తాజా పరిస్థితుల‌పై నేత‌ల‌తో చ‌ర్చించేందుకు జ‌న‌సేన అధినేత సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా జులై 6 వ తేదీన విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించ‌బోతున్నారు. విజ‌య‌వాడ‌లో ఆయ‌న పార్టీ నాయ‌కుల‌తో స‌మావేశం అవుతారు. తెలుగు రాష్ట్రాల మ‌ధ్య నెల‌కొన్న జ‌ల‌వివాదాలు, ఇటీవ‌లే ప్ర‌భుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండ‌ర్‌, రాష్ట్రంలో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్యలు వంటి వాటిపై చర్చించ‌బోతున్నారు.

విజయవాడ ప‌ర్య‌ట‌న అనంతరం ప‌వ‌న్ క‌ళ్యాణ్ జులై 7 వ తేదీన మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీస్‌లో ముఖ్య‌నేత‌ల‌తో సమావేశం అవుతారు. రాబోయో రోజుల్లో పార్టీ కార్యక్రమాల గురించి, పార్టీ బలోపేతం గురించి సమావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉన్న‌ది. పార్టీకి చెందిన పలువురు నేతలతో జ‌న‌సేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈరోజు సమావేశం కానున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This