Tuesday, July 27, 2021

బ్రేకింగ్: తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తివేత?

Must Read

తెలంగాణలో ఈనెల 19 వ తేదీతో రాష్ట్రంలో లాక్‌డౌన్ స‌మ‌యం ముగియ‌నున్న‌ది. కరోనా కేసులు తగ్గుముఖం పడుతుడటంతో రాష్ట్ర ప్రభుత్వం మరిన్నిసడలింపులు ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ దిశగానే లాక్ డౌన్ సడలింపులపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తెలంగాణలో ఎల్లుండి (శనివారం) నుంచి అన్ లాక్ 2.0 అమల్లోకి రానుంది. రాష్ట్రంలో మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మినహాయింపు ఇస్తారా లేదంటే పూర్తిగా ఎత్తివేస్తారా అనే దానిపై ముఖ్య‌మంత్రి కేసీఆర్ త్వ‌ర‌లోనే నిర్ణ‌యం తీసుకోనున్నారు.

మంత్రుల నుంచి, ఆరోగ్య‌శాఖ నుంచి ముఖ్య‌మంత్రి ఇప్పటికే ఫీడ్‌బ్యాక్ తీసుకున్న‌ట్టు స‌మాచారం. రాష్ట్రంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. పైగా ఈనెల 21 నుంచి కేంద్రం 18 ఏళ్లు నిండిన అంద‌రికీ ఉచితంగా క‌రోనా వ్యాక్సిన్‌ను అందిస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో లాక్‌డౌన్‌ను జూన్ 20 నుంచి ఎత్తివేస్తార‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. జూన్ 19 త‌రువాత రాష్ట్రంలో కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌లు కూడా ఉండ‌టంతో లాక్‌డౌన్‌పై కీల‌క నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశం ఉన్నట్టు సమాచారం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This