Tuesday, July 27, 2021

కృష్ణా జలాల ఏపీ దోపిడీకి కేసీఆరే కారణం: రేవంత్ రెడ్డి

Must Read

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతున్న సంగతి తెలిసిందే..గత కొన్ని రోజులగా రెండు రాష్ట్రాల నాయకుల మధ్య వాగ్వాదాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టులను కలిపినా తమ రాష్ట్రానికి కేవలం ఒక టీఎంసీ నీటిని మాత్రమే వాడుకోగలమని.. కానీ, రోజుకు 11 టీఎంసీల నీటిని తరలించేలా జగన్ ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు.

కృష్ణా జలాల దోపిడీలో వైయస్ రాజశేఖరరెడ్డి పాత్ర లేదని.. కానీ, ఇప్పుడు జగన్ హస్తం ఉందని వ్యాఖ్యానించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం వెనుక కేసీఆర్ సూచనలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. కేసీఆర్ కనుసన్నల్లోనే ఈ పథకానికి రూపకల్పన జరిగిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులను షర్మిల పార్టీ వైపు నడిపించేందుకు కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని చెప్పారు. కృష్ణా జలాల దోపిడీకి కేసీఆరే కారణమని అన్నారు. నీళ్ల అంశాన్ని కేసీఆర్ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారని రేవంత్ మండిపడ్డారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This