Tuesday, July 27, 2021

కోడలిపై కన్నేసిన మామ.. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి..

Must Read

ఆ రోజుల్లో ఆడవారిపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. చిన్నా పెద్దా అనే తేడాలు లేకుండా ప్రతిరోజూ ఎక్కడో అక్కడ ఆడవారిపై లైంగిక దాడులు, అత్యాచారాలకు పాల్పపడుతున్నారు. కోడల్ని కన్న కూతురిలా చూడాల్సిన మామ ఆమెపై కన్నేశాడు.. ఎలాగైనా అనుభవించాలని చూశాడు.. కానీ పాపం పండి కన్న కొడుకు చేతిలోనే హతమయ్యాడు.

వివరాల్లోకి వెళితే.. గిద్దలూరు మండలంలోని దంతెరపల్లె గ్రామానికి చెందిన రంగప్రసాద్ భార్య, తండ్రి భాస్కర్‌తో కలిసి ఉంటున్నాడు. గత కొంత కాలంగా భాస్కర్ తన కోడలిపై కన్నేశాడు.. కొడుకు లేని సమయంలో తన కోరిక తీర్చాలని బలవంతం చేసేవాడు. కొన్నాళ్లు ఓపిక పట్టిన ఆమె సహనం కోల్పోయి ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో పద్ధతి మార్చుకోవాలని రంగప్రసాద్‌ తన తండ్రిని హెచ్చరించాడు. కానీ ఆ కామాంధుడు తన వక్ర బుద్ది మాత్రం మార్చుకోలేదు.

అతడిలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన రంగప్రసాద్ రాత్రి నిద్రపోతున్న సమయంలో తండ్రి గొడ్డలితో నరికి చంపేశాడు. తన తండ్రి కరోనాతో మరణించాడని గ్రామస్తులను నమ్మించాడు. గ్రామంలో పోలేరమ్మ ఉత్సవాలు ఉన్నాయని, మృతదేహం గ్రామంలో ఉండకూడదంటూ సమీప బంధువుల సహకారంతో రాత్రికి రాత్రే దహనం చేసే ప్రయత్నం చేశాడు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This