Home Politics ఏపీలో లాక్ డౌన్ సడలింపులు..! కొత్త రూల్స్ ఇవే

ఏపీలో లాక్ డౌన్ సడలింపులు..! కొత్త రూల్స్ ఇవే

0

ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ వేళల్లో మార్పులు చోటుచేసుకొనున్నాయి. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నాం 2 గంటల వరకు కర్ఫ్యూ నుంచి సడలింపులు ఇస్తున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కర్ఫ్యూ కటినంగా అమలు కానుంది. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం మేరకు కర్ఫ్యూ సడలింపు వేళల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

కర్ఫ్యూ వేళల్లో రూల్స్ కు విరుద్దంగా ఎవరైనా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం. ఇక ఏపీలో జూన్‌ 20 వరకు కర్ఫ్యూను పొడిగించిన సంగతి తెలిసిందే. కాగా.. ఏపీలో కొత్తగా 8766 కరోనా కేసులు రిజిస్టర్ అయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,79,773 కు చేరింది.

ఇందులో 16,64,082 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 1,03,995 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 67 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 11,696 మంది చనిపోయినట్టు సమాచారం.

Exit mobile version