Saturday, June 19, 2021

కెసిఆర్ కు షాకిచ్చిన ఈట‌ల‌.. రాజీనామాపై సంచలన నిర్ణయం

Must Read

తెలంగాణలో నాటకీయ ప‌రిణామాల‌ మధ్య ఈట‌ల రాజేంద‌ర్ మంత్రి ప‌ద‌వి పోయింది.. దీంతో.. ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ వేదిక‌పై త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డిన టీఆర్ఎస్ సీనియ‌ర్ నేత‌.. అన్ని పార్టీల నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు.. చివ‌ర‌కు BJP వైపే ఆయ‌న మొగ్గు చూపారు.. ఢిల్లీలో వెళ్లి మ‌రి అక్కడ నేతలతో చర్చించి త‌న‌కు ఉన్న అనుమానాల‌ను నివృత్తిచేసుకునే ప‌నిలో ప‌డ్డారు.. త‌న‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని కోరారు.. మొత్తంగా బీజేపీ అధిష్టానం నుంచి ఆయ‌న‌కు సానుకూల ప‌రిస్థితులు ఉన్న‌ట్టుగా తెలుస్తోంది.. రేపు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు రానున్నారు ఈట‌ల‌.. జూన్ 4వ తేదీన శుక్రవారం రోజు.. MLA ప‌ద‌వికి రాజీనామా చేసే అవ‌కాశం ఉంద‌ని విశ్వాసనీయ సమాచారం.

ప్రెస్ మీట్ పెట్టిత‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్టు ఈట‌ల రాజేంద‌ర్ ప్ర‌క‌టిస్తార‌ని చెబుతున్నారు. వచ్చే వారం మ‌ళ్లీ ఢిల్లీ వెళ్ల‌నున్న ఈట‌ల బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ న‌డ్డా సమక్షంలో బీజేపీలో చేర‌నున్నారు.. మొత్తంగా.. వారం రోజులుగా మాజీ ఎంపీ వివేక్ వెంక‌ట‌స్వామి, ఇత‌ర నేత‌లు చేస్తున్న ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లం అయిన‌ట్టు చెబుతున్నారు.. ఇక‌, MLA ప‌ద‌వికి రాజీనామా చేసిన త‌ర్వాత ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వ్యూహ రచన ఖరారు చేయ‌నున్నారు బీజేపీ రాష్ట్ర నేత‌లు.

రాజీనామాతో వ‌చ్చే ఉప ఎన్నికలో ఈటల రాజేంద‌ర్‌ విజయమే లక్ష్యంగా ప్లాన్ చేసుకుంటున్నారు.. ఇవాళ అరగంటకు పైగా బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇంచార్జ్ జనరల్ సెక్రటరీ సంతోష్ తో చర్చలు జరిపిన ఈటెల.. ఈ అంశాలు అన్నీ వివరంగా మాట్లాడినట్టు తెలుస్తోంది.. మ‌రోవైపు.. కర్నాటక తర్వాత తెలంగాణలో BJP బలోపేతంపై ఆ పార్టీ అధిష్టానం మ‌రింత ‌కట్టుదిట్టంగా అడుగులు వేస్తున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This