Saturday, June 19, 2021

ఈటల రాజీనామా.. టీఆర్ఎస్‌కు గుడ్‌బై.. కేసీఆర్‌పై షాకింగ్ కామెంట్స్

Must Read

ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు TRS పార్టీకి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. శామీర్‌పేటలోని తన ఇంటి నుండి మీడియాతో మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. బతికి ఉండగానే బొందపెట్టమని కేసీఆర్ ఆదేశించినట్లు ఆయన వాపోయారు.

కేసీఆర్ పాలనలో మంత్రులు అందరిని బానిసలుగా చూస్తారని తన చెప్పు చేతల్లో ఉండేలా చూస్తారని మండిపడ్డారు. ప్రగతిభవన్‌ను బానిస నిలయంగా మార్చుకోవాలని సీఎం కేసీఆర్‌పై ఎదురు దాడికి దిగారు ఈటల రాజేందర్. నా వివరణ తీసుకోకుండానే మంత్రివర్గం నుంచి తొలగించారు. కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా విచారణకు ఆదేశించారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను. కానీ నన్ను బతికి ఉండగానే బొందపెట్టమని హరీష్‌రావును సీఎం కేసీఆర్ కు ఆదేశాలు ఇచ్చారు. నియోజకవర్గ ప్రజలను డబ్బులిచ్చి లొంగదీసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.

నాకు జరిగిన అన్యాయాన్ని చూసి ప్రజలు కూడా చూసి ఎంతో బాధపడ్డారు. కుట్రలను తిప్పికొడతామని, కడుపులో పెట్టుకొని తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని.. మేం మళ్లీ గెలిపించుకుంటామని చెప్పారు. అందుకే MLA పదవికి రాజీనామా చేస్తున్నా. 19 ఏళ్ల TRS అనుబంధానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా. కేసీఆర్ తన కూతురికి కూడా బీఫామ్ ఇచ్చారు. కానీ ఆమె ఘోరంగా ఓడిపోయారు. ఈటల రాజేందర్ అనే నాయకుడు ఎప్పుడు కూడా ఓడిపోలేదని ఈటల రాజేందర్ శపధం చేసారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This