Saturday, June 19, 2021

మోడీ గుడ్ న్యూస్: జూన్ 21 నుంచి అంద‌రికీ ఫ్రీగా వ్యాక్సిన్

Must Read

వ్యాక్సిన్లపై రాష్ట్రాలకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై కేంద్రమే కంపెనీల నుంచి వ్యాక్సిన్ కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందజేస్తుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. వ్యాక్సినేషన్ బాధ్యత ఇకపై కేంద్రమే పూర్తిగా తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. జూన్ 21 నుండి దేశంలో 18 సంవ‌త్స‌రాలు నిండిన ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ ఇస్తామ‌ని ప్ర‌ధాని మోడీ ప్ర‌క‌టించారు. వ్యాక్సిన్ ఖ‌ర్చును కేంద్ర‌మే భ‌రిస్తుంద‌న్నారు.

దేశంలో ఉత్ప‌త్తి అవుతున్న వ్యాక్సిన్ల‌లో కేవ‌లం 25శాతం వ్యాక్సిన్లు ప్రైవేటులో అందుబాటులో ఉంటాయ‌ని, మిగ‌తావ‌న్ని కేంద్ర‌మే కొని రాష్ట్రాల‌కు ఇస్తుంద‌న్నారు ప్ర‌ధాని. దేశంలో మ‌రో మూడు కంపెనీల వ్యాక్సిన్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, ప్ర‌తి ఒక్క‌రికి వ్యాక్సిన్ వేయ‌ట‌మే ల‌క్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.

దేశ ప్ర‌జ‌ల‌నుద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాని… గ‌తంలో విదేశాల్లో టీకాలు వ‌చ్చినా ఇండియాకు వ‌చ్చేందుకు ఏళ్లు ప‌ట్టేద‌ని, ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేద‌న్నారు. సెకండ్ వేవ్ లోనూ ఆర్మీ, నేవీ స‌హ అనేక సంస్థ‌లు నడుంబిగించి… ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా యుద్ధ‌ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేశామన్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This