Friday, July 30, 2021

ఎంపీ కేశినేని తెలుగు రాష్ట్రాల సీఎంలపై విమర్శలు….అంతా డ్రామా

Must Read

తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ పతాక స్థాయికి చేరిన విషయం తెలిసిందే. కాగా తాజాగా తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంపై విజయవాడ టీడీపీ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని స్పందిచారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే అంటూ సంచలన కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో ఇరు రాష్ట్రాల మంత్రుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా ఈ విషమంపై సీఎం జగన్ స్పందించారు. తన తండ్రిపై, తన ప్రభుత్వంపై హద్దుమీరి తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్నారని అభిప్రాయపడ్డారు. ఆంధ్రా ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉన్నారని, అందుకే సంయమనంతో వ్యవహరిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ ప్రజల్ని కేసీఆర్, ఏపీ ప్రజల్ని జగన్ పిచ్చోళ్ళని చేసి ఆడుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. వాటర్ వార్‌ను పెద్ద డ్రామాగా అభివర్ణించిన కేశినేని.. ఎన్నికల ముందు తర్వాత ఇద్దరి సీఎంల మధ్య పరస్పర సహకారం అందరికీ తెలిసిందే అన్నారు. హైదరాబాద్ లో తన ఆస్తులు కాపాడుకునేందుకు నీటి వివాదంపై కేసీఆర్ తో కలిసి జగన్ ఆడే డ్రామానే ఇదంతా అని చెప్పుకొచ్చారు. ఎన్నికల తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు బొకేలు ఇచ్చుకుని ఆలింగనాలు చేసుకుంటే రాష్ట్రానికి మంచి జరుగుతుందని తానూ భావించానని.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఇద్దరి నాటకాలని స్పష్టమైందన్నారు.

హైదరాబాద్ లో చెల్లి షర్మిలను పెట్టి, ఇక్కడ జగన్ ఆడే డ్రామాలు గమనించలేనంత పిచ్చోళ్లు ప్రజలు కాదని చెప్పారు. 80శాతం పూర్తయిన రాజధాని నిర్మాణాలు వదిలి కరకట్ట అభివృద్ధి చేస్తాననటాన్ని ఎలా చూడాలని కేశినేని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే రాజధాని అభివృద్ధిలో భాగంగా అన్ని నిర్మాణాలు పూర్తి చేయాలని సవాల్ విసిరారు

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This