Saturday, June 19, 2021

బ్రేకింగ్: CID అధికారుల‌కు ఎంపీ ర‌ఘురామ లీగ‌ల్ నోటీసులు

Must Read

AP సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు పంపించి ఒక్కసారిగా షాకిచ్చారు. త‌న‌ను అరెస్టు చేసిన సమయంలో తన దగ్గర నుంచి తీసుకున్న అన్ని వస్తువులను మెజిస్ట్రేట్‌ వద్ద జమ చేయాలంటూ నోటీసు పంపారు. తన ఫోన్‌లో విలువైన సమాచారం ఉందని రఘురామ చెప్పారు.

త‌న మొబైల్‌ పాస్ వర్డ్ అన్ లాక్ ‌ చేసి ఇవ్వాలని కస్టడీలో హింసించారని అని లీగల్‌ నోటీసులో పేర్కొన్న‌ రఘురామ… ఆ ఫోన్ లో కుటుంబ సభ్యుల వ్యక్తిగత వివరాలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో తాను స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నానని, ఫోన్ లో దానికి సంబంధించిన విలువైన సమాచారం ఉందని తెలియజేసారు.

పార్లమెంటు విధులు నిర్వర్తించేందుకు వీలుగా ఫోన్ తిరిగివ్వాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ ను అప్పగించకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటానని రఘురామకృష్ణరాజు సీఐడీ అధికారుల‌కు వార్నింగ్ ఇచ్చారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This