Saturday, June 19, 2021

బ్రేకింగ్: సీఎం జగన్ కు రఘురామ కృష్ణంరాజు లేఖ..!

Must Read

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు లేఖ రాశారు. ఎన్నికల సమయం లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పై ఉందని గుర్తుచేసారు. అయితే ఈ నెల నుండి వృద్ధాప్య పింఛన్లను 2,750 రూపాయలకు పెంచి ఇవ్వాలని లేఖలో డిమాండ్ చేశారు.

అయితే సంవత్సరం నుంచి పెండింగ్ ఉన్న పింఛను మూడు వేల రూపాయలను కూడా కలిపి ఇవ్వాలి అంటూ లేఖ లో సీఎం జగన్ ను కోరారు. అయితే ఎన్నికల సమయం లో వైసీపీ ప్రభుత్వం వృద్ధాప్య పింఛన్లు పెంచుతామని హామీ ఇచ్చిన విషయాన్ని తెలిపారు.

అయితే రెండు వేల నుండి మూడు వేలకు పెంచుతాం అని హామీ ఇవ్వడం ద్వారానే వైసీపీ కి ప్రజల నుండి పూర్తి మద్దతు వచ్చింది అంటూ లేఖలో వెల్లడించారు. అయితే దీనికి వైసీపీ నేతల నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This