Friday, July 30, 2021

బ్రేకింగ్:త్వ‌ర‌లో ఈటీవీ గ్రూప్ నుండి కొత్త OTT

Must Read

క‌రోనా ‌మహమ్మారి వల్ల థియేటర్స్ మూతపడిన సంగతి తెలిసిందే.. దీంతో ఒక్కసారిగా ఓటీటీల‌కు గిరాకీ పెరిగిపోయింది. ఇప్ప‌టికే డ‌జ‌న్ ఓటీటీలున్నా… అన్నింటికి మంచి ఆద‌ర‌ణ ఉంది. వెబ్ సిరీస్ ల‌తో పాటు చిన్న బ‌డ్జెట్ సినిమాల కోసం జ‌నం ఓటీటీల‌ను ఫాలో అవుతున్నారు.

ఇప్ప‌టికే మంచి పాపులారిటీ ఉన్న అమెజాన్ ప్రైం, నెట్ ఫ్లిక్స్, జీ5, సోనీ లివ్, హాట్ స్టార్ ల‌కు తోడుగా ఇప్పుడు ఈటీవీ గ్రూప్ నుండి ఓటీటీ సంస్థ రాబోతుంది. ఇప్ప‌టికే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు శ‌ర‌వేగంగా సాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈటీవీ వ‌ద్ద వంద‌లాది సినిమాలున్నాయి. ప‌లు క్లాస్ సినిమాలు ఈటీవీ వ‌ద్ద ఉండ‌టం అద‌న‌పు అడ్వాంటేజ్ గా వారు భావిస్తున్నారు.

అంతేకాదు 200కోట్ల ప్ర‌త్యేక బ‌డ్జెట్ తో టాక్ షోలు, వెబ్ సిరీస్ లు, చిన్న బ‌డ్జెట్ సినిమాల‌ను రూపొందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. కొత్త ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశం ఇస్తూ వాటిని ఓటీటీ నుండి రిలీజ్ చేసేలా ప్ర‌య‌త్నాలు చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న వెలువడనున్నట్టు సమాచారం.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This