Saturday, June 19, 2021

తెలంగాణలో నో లాక్ డౌన్.. ఓన్లీ నైట్ క‌ర్ఫ్యూ…?

Must Read

ఇండియాలో చాలా రాష్ట్రాలతో పోల్చితే… తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. మరణాలు కూడా తక్కువే వస్తున్నాయని కేసిఆర్ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించబోతోంది. ఇందులో… సీఎం కేసీఆర్… తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగించాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం తెలంగాణలో రోజూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే… సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత కఠిన లాక్‌డౌన్ అమల్లో ఉంది. ఇది జూన్ 9 వరకూ అమల్లో ఉంటుంది. ఈ లాక్‌డౌన్ వల్ల కేసులు భారీగా తగ్గాయని ఇంకా దీన్ని కొనసాగించడం అవసరం లేదని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నెల 9వ తేదీతో ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన లాక్ డౌన్ గ‌డువు ముగియ‌నుండ‌టంతో, మ‌ధ్యాహ్నం సీఎం కేసీఆర్ అధ్యక్ష‌త‌న తెలంగాణ మంత్రివ‌ర్గ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ స‌మావేశంలో లాక్ డౌన్ కొన‌సాగించాలా… వ‌ద్దా అనే అంశంపై ఆఖరి నిర్ణ‌యం తీసుకోనున్నారు.

తెలంగాణ‌లో ప్ర‌స్తుతం ప్ర‌తిరోజు రెండు వేల కేసుల వ‌ర‌కు వ‌స్తున్నాయి. పాజిటివ్ రేటు 5శాతం లోపే ఉంద‌ని వైద్యారోగ్య శాఖ అధికారులంటున్నారు. దీంతో ప‌గ‌టి పూట లాక్ డౌన్ ఎత్తివేసి… కేవ‌లం రాత్రి 8గంట‌ల నుండి ఉద‌యం 6గంట‌ల వ‌ర‌కు క‌ర్ఫ్యూ క‌ఠినంగా అమ‌లు చేసే ఆలోచ‌న‌లో ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This