Tuesday, July 27, 2021

జనసేన పార్టీ కార్యక్రమాల్లో మళ్ళీ పవన్‌ కళ్యాణ్…నేడు అమరావతికి పయనం

Must Read

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు అమరావతి వెళ్తున్నారు. ఆరు నెలల తర్వాత పార్టీ కార్యక్రమాల్లో నేరుగా ఆయన పాల్గొననున్నారు. ఏపీలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. పవన్ నేడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ కానున్నారు. ఆ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ నగరానికి మూడు రోజుల క్రితమే వచ్చారు. ముఖ్యంగా ప్రభుత్వం నిరుద్యోగుల బాధను పట్టించకపోవడంతో వాటిపై చర్చించే అవకాశం ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్, పన్నుల పెంపు, కృష్ణాజలాల వివాదాలపై పవన్ భేటీ అనంతరం స్పందించే అవకాశాలు ఉన్నాయి.

ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి సంఘాలతో చర్చిస్తారని సమాచారం. దీంతోపాటు పార్టీ బలోపతానికి సంబంధించి అంతర్గత సమావేశాలు నిర్వహించనున్నారు జనసేనాని. తొలుత మంగళగిరి పార్టీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ కరోనాతో చనిపోయిన వారికి సంతాపం ప్రకటిస్తారు. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీతో భేటీ అవుతారు. దాని తర్వాత విద్యార్థి సంఘాలు, టీచర్ల సంఘాలతో మాట్లాడి వారి నుంచి వినతి పత్రాలు తీసుకుంటారు. ప్రస్తుతానికి పవన్ పర్యటన ఒకరోజు మాత్రమే ఖరారైందని, అవసరం ఉంటే రెండో రోజు కూడా ఉంటారని చెబుతున్నాయి పార్టీ వర్గాలు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This