Saturday, June 19, 2021

కేవలం రూపాయికే లీటరు పెట్రోల్‌..! ఎక్కడంటే?

Must Read

ఈ కరోనా మహమ్మారి తో ప్రజలందరూ ఎన్ని కష్టాలు పడుతున్నారో అందరికి తెలిసిందే.. వైరస్ భయంతో లాక్ డౌన్ విధించడంతో ఆదాయ మార్గాలు పడిపోతున్నాయి. సంపాదన తగ్గిపోతుంది. కరోనా చికిత్స పేరుతో దోపీడికి గురవుతున్నాడు సామాన్యుడు.. ఇక కర్ఫ్యూలు.. కఠిన ఆంక్షలతో సంపాదించే మార్గాలు అన్నీ మూసుకుపోతున్నాయి. ఇలాంటి సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు వాహనదారులుకు చుక్కలు చూపిస్తునాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లలో లీటర్ పెట్రోల్ ధర 100 మార్క్‌ను దాటేసి.. వేగంగా దూసుకుపోతోంది. అయితే వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర కేవలం రూ1.46 మాత్రమే.. నమ్మట్లేదా నిజమండీ బాబు..!

ఇక్కడ మంచినీళ్ల కంటే పెట్రోల్ చీప్‌గా దొరుకుతుంది. ఇక ఇరాన్‌లో అయితే రూ.4.24 లీటరు పెట్రోల్ వస్తుంది. అలాగే అంగోలాలో లీటరు పెట్రోల్ రూ.17.88కు దొరుకుతోంది. ఇదిలా ఉంటే కొన్ని దేశాల్లో అయితే లీటరు పెట్రోల్ రేటు 100కంటే ఎక్కువే ఉంది.

వివరాల్లోకి వెళ్తే.. హాంగ్ కాంగ్‌లో లీటరు ధర రూ.169.21గా ఉంటే, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్‌లో రూ.150, సిరియాలో రూ.149 గా ఉంది. అలాగే నెదర్లాండ్స్‌లో కూడా పెట్రోల్ రేటు లీటరుకు రూ.140 వద్ద ఉందని ఆ దేశాలు చెబుతున్నాయి. ఇలా కొన్ని దేశాల్లో పెట్రోల్ రేటు చీప్‌గా ఉంటే.. కొన్న్ని దేశాల్లో మాత్రం ధరలు ఆకాశాన్ని అంటాయి

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This