Friday, July 30, 2021

కాంగ్రెస్‌ పార్టీ పై ప్రధాని మోడీ వాఖ్యలు… ఎమర్జెన్సీ చీకటి రోజులను మర్చిపోలేం

Must Read

ప్రజల ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ దేశంలో ఎమర్జెన్సీని ప్రకటించి నేటికి 46 ఏళ్లు పూర్తయ్యాయి.

ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. ఎమర్జెన్సీతో దేశ ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ కాలరాసిందంటూ ధ్వజమెత్తారు. నాటి చీకటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేమని వ్యాఖ్యానించారు. ఎమర్జెన్సీ అమలులో ఉన్న 1975-1977 మధ్యకాలంలో దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారంటూ ధ్వజమెత్తారు. దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు, రాజ్యాంగ విలువలను పెంపొందించేందుకు కంకణబద్ధంకావాలంటూ దేశ ప్రధాని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో వేటివేటిని బ్యాన్ చేశారో తెలియజేస్తూ బీజేపీ చేసిన ఓ పోస్ట్‌ను కూడా ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ కాలం చీకటి రోజులుగా మిగిలిపోయింది. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాటాలు చేసిన ఎందరో జైళ్లకు వెళ్లారు.1975 జూన్ 25న నాటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటన చేశారు. 1975 నుంచి 1977 వరకు 21 మాసాలు పాటు(దాదాపు రెండేళ్లు) దేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352 మేరకు దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ 1975 జూన్ 25న ఆదేశాలు జారీ చేశారు. 1977 మార్చి 21న ఎమర్జెన్సీని ఉపసంహరించుకున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This