Tuesday, July 27, 2021

ఈ రోజు తెలంగాణ పీసీసీగా రేవంత్‌ బాధ్యతల స్వీకరణ

Must Read

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు నుంచి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు. గాంధీ భవన్‌లో ఉత్తమ్ కుమార్ రెడ్డి నుంచి చార్జీ తీసుకుంటారు. అయితే పీసీసీ చీఫ్ గా రేవంత్ ముందు చాలా సవాళ్లు ఉన్నాయి. సీనియర్లను కలుపుకుపోవడం ఒక ఎత్తు అయితే.. కేడర్ లో జోష్ నింపాల్సిన బాధ్యత మీద పడింది. ఇప్పటికే జానారెడ్డి మొదలుకుని ఒక్కొక్కరు సీనియర్ నేత ఇళ్లకు వెళ్లి కలిసి, వారి ఆశీస్సులు తీసుకున్నారు. అందరినీ కలుపుకుపోతానని రేవంత్ చెబుతున్నా.. అదంత తేలికగా కనిపించడం లేదు.

కాంగ్రెస్ పార్టీలో మొదటినుంచి కలహాలు ఎక్కువ కాబట్టి అందరిని సమన్వయం చేసుకుంటు ముందుకు తీసుకువెళ్లడం రేవంత్ ముందు ఉన్న అతి పెద్ద సవాల్. కాంగ్రెస్‌లో ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎప్పుడు.. ఎవరు ఎలా స్పందిస్తారో ఊహించడం చాలా కష్టం. అసమ్మతి రాగం. అసంతృప్తులు మామూలే. రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలలో కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ సమస్య. రేవంత్ ఒక్కడే తెలంగాణ కాంగ్రెస్ ని నడిపించగలరా? సీనియర్లను సమన్వయం చేసుకోగలరా ..? సొంత కోటరీ ఏర్పాటు చేసుకోగలరా.. ? ఎంతమంది నేతలు రేవంత్ రెడ్డికి సహకరిస్తారు? రాష్ట్రంలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం వస్తుందా? అనేది భవిష్యత్తే నిర్ణయిస్తుంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This